హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టీ-హబ్‌కు మరో అవార్డు లభించింది. దేశంలో ఉత్తమ ఇంక్యూబెటర్ సంస్థగా నిలిచింది. ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 55 ఇంక్యుబేటర్లు ఈ అవార్డు కోసం పోటీపడ్డాయి. వీటన్నింటిని టీ-హబ్ వెనక్కి నెట్టి అవార్డును సొంతం చేసుకుంది. టీ-హబ్‌కు అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.