టీ20 ప్రపంచకప్‌లో మరో సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్‌లో ఫిలిప్ ఈ ఘనత సాధించాడు. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఫిలిప్ క్రీజులోకి వచ్చాడు. తొలుత వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగానే ఆడినా ఆ తర్వాత బలంగా పుంజుకుని వీరవిహారం చేశాడు. 64 బంతుల్లో 104 పరుగులు చేసి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. న్యూజిలాండ్ స్కోరు 167/7.
T20WC: మరో సెంచరీ నమోదు

© ANI Photo(file)