10 డౌనింగ్ స్ట్రీట్లో రిషి నివాసం
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కోటీశ్వరుడు. ఆయన తనకున్న ఎన్నో విలాసవంతమైన భవనాలను వదిలి.. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన అందులోనే నివసించారు. ఈ విషయాన్ని ఆ సెక్రటరీ ధ్రువీకరించారు. దీనికంటే 11 డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ విశాలంగా ఉంటుంది. కానీ రుషి మాత్రం 10లో ఉండాలనుకుంటున్నారు. ఈ ప్లాట్ ఆయనకు కలిసొచ్చిందని అందుకే ఆయన అందులో ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు సెక్రటరీ పేర్కొన్నారు.