నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలిగొంది. నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో ఉన్న గోల్ఫ్‌కోర్స్ వద్ద చోటుచేసుకుంది. గోల్ఫ్‌కోర్స్‌లోని ఓ నీటి గుంతలో ఈత కొట్టడానికి ముగ్గురు చిన్నారులు ప్రయత్నించారు. లోతు తెలియక ఒకరి వెంట మరొకరు నీటిగుంటలో పడి చనిపోయారు. మృతులను దిలీప్, పవన్, షాబాద్లుగా పోలీసులు గుర్తించారు. కాగా గోల్ఫ్‌కోర్స్‌కు రక్షణ గోడ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు.