SIపైనుంచి దూసుకెళ్లిన వాహనం..నిందితులు అరెస్టు
మైనింగ్ మాఫియా నేపథ్యంలో హరియాణాలో DSP క్యాడర్ అధికారి హత్య ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. తాజాగా ఝార్ఖండ్ లో ఇంఛార్జ్ మహిళా ఎస్ఐ మృతి చెందారు. ఆవులను అనుమతి లేకుండా తరలిస్తున్నారని ఆపినందుకు ఆమెపై నుంచి దుండగులు వాహనంను తీసుకెళ్లారు. ఘటనలో SIకి తీవ్రంగా గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. ఘటనలో అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.