జిమ్ చేస్తూ మరో ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ టీవీ నటుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ గుండెపోటుతో మృతిచెందారు. ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ పెట్టే సూర్యవంశీ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా..వైద్యులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘కుసుమ్’, కసౌటి జిందగీ కే’, ‘జిద్దీ దిల్ మానే నా’ వంటి అనేక షోలలో సూర్యవంశీ నటించి మెప్పించారు. గతంలో పునీత్ రాజ్‌కుమార్, సిద్ధార్థ్ శుక్లా, బ్రహ్మస్వరూప్ మిశ్రా, దీపేశ్ భాన్ వంటి అనేక మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.