INDvsBAN: అడిలైడ్‌లో పొడి వాతావరణం
బంగ్లాతో భారత్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగిస్తాడని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే, గత కొన్ని గంటల నుంచి అడిలైడ్‌లో వర్షం పడట్లేదు. వాతావరణం కూడా నిన్నటితో పోలిస్తే పొడిగానే ఉంది. దీంతో పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సూచిస్తున్నప్పటికీ వర్షం పడకపోవడం కాస్త ఊరట కలిగించే విషయమని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, ఈ మ్యాచులో టీమిండియా గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.