• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘మేజ‌ర్’ 21 డేస్‌ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌

  మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ‘మేజ‌ర్’ మూవీ జూన్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. తెలుగురాష్ట్రాల్లో ఈ మూవీ 21 రోజుల్లో ఇప్ప‌టివ‌రకు రూ.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.62 కోట్లు రాబ‌ట్టింది. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌గా అడివి శేష్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

  అఖీరా తనకు ఫుల్ క్లోజ్ అని తెలిపిన అడివి శేష్

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అఖీరానందన్ తనకు చాలా క్లోజ్ అని మేజర్ మూవీ హీరో అడివిశేష్ తెలిపాడు. పవన్ కల్యాణ్ కంటే తనకు అఖీరా బాగా దగ్గర అని పేర్కొన్నాడు. తాను అఖీరా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు.. తామిద్దరం బాస్కెట్ బాల్ ఆడుతుంటామని ఆయన వివరించాడు. పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ కూడా అడవి శేష్ సినిమాలు అఖీరాకు ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

  అడివి శేష్ కోసం అకీరా స్పెష‌ల్ సాంగ్.. వైరల్ వీడియో

  అడివి శేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు అకీరా నంద‌న్ మంచి ఫ్రెండ్స్‌. వ‌య‌సులో తేడా ఉన్నా వీరిద్ద‌రి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అడివి శేష్ అంటే అకీరాకు అభిమానం. అయితే ఇటీవ‌ల అకీరా ఆర్ఆర్ఆర్‌లో ‘దోస్తీ’ పాట‌ను పియానాతో ప్లే చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అడివి శేష్ కోసం ‘మేజ‌ర్’ సినిమాలోని ‘హృద‌య‌మా’ పాట‌ను పియానాతో ప్లే చేసి వినిపించాడు. అకీరాకు థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోను అడివి శేష్ త‌న సోష‌ల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.

  స్కూల్ స్టూడెంట్స్ కు ‘మేజర్’ ఆఫర్

  మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే దేశం కోసం పోరాడిన వీరుడి గురించి విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘మేజర్’ చిత్ర యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు కేవలం 50శాతం టికెట్ చార్జీతో సినిమా చూడొచ్చని తెలిపింది. పాఠశాల యాజమాన్యాలు majorscreening@gmail.com కి మెయిల్‌ చేస్తే మేజర్‌ టీం ఆ పాఠశాలకు ప్రత్యేక షో ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.

  ‘మేజ‌ర్’ చిత్ర‌బృందాన్ని ప్ర‌శంసించిన మెగాస్టార్

  మెగాస్టార్ చిరంజీవి ‘మేజ‌ర్’ చిత్ర‌బృందాన్ని ప్ర‌శంసించారు. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితాన్ని తెర‌పై చాలా చ‌క్క‌గా చూపించార‌ని వెల్ల‌డించాడు. అడివి శేష్‌తో పాటు డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్కా, ఇత‌ర బృందాన్ని మెచ్చుకున్నారు. మెగాస్టార్ మా సినిమాను చూసి అందులో ఏం న‌చ్చాయో చెప్ప‌డం నాకు అన్నింటికంటే పెద్ద అవార్డు. మీ మంచి మ‌న‌సు మ‌రోసారి అర్థ‌మైంద‌ని అడ‌విశేష్ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. మ‌రోవైపు మేజ‌ర్‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన మ‌హేశ్ బాబు కూడా చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశాడు.

  ‘మేజ‌ర్’ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించిన అమితాబ్

  మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కి సినీలోకం ప్రశంసలు అందుకుంటున్న చిత్రం మేజర్. సూపర్ స్టార్ మహేశ్ ఈ సినిమా నిర్మించారు. 26-11 ముంబై దాడుల్లో మేజర్ సందీప్ వీరత్వాన్ని సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాకు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమితా బచ్చన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అడివి శేష్, సయీ మంజ్రేకర్‌కు నా శుభాకాంక్షలు” అని బిగ్ బీ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి

  రియల్ ‘మేజర్’ స్ఫూర్తినిస్తున్న రీల్ ‘మేజర్’

  మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం యువతలో ఎనలేని స్ఫూర్తి నింపుతోంది. ఒకప్పుడు ఆర్మీ నేపథ్యం ఉన్న సినిమాలంటే ఉత్తరాదిలోనే ఎక్కువగా ఆదరణ ఉండేది. సైన్యంవైపు మొగ్గుచూపే యువత అక్కడే ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. కానీ ‘మేజర్’ ప్రతి యువకుడినీ కదిలిస్తోంది. ఉద్వేగాన్ని పెంపొందించి ఆర్మీ గొప్పదనాన్ని చాటుతూ..వారిలో ఆర్మిలో చేరాలనే స్ఫూర్తిని నింపుతోంది. ఓ రకంగా ఈ రీల్ మేజర్ రియల్ ‘మేజర్’లను తయారుచేస్తోంది.

  ‘మేజ‌ర్’ ఫ‌లితంతో సంతృప్తిగా లేన‌ని చెప్పిన అడ‌వి శేష్‌

  ‘మేజ‌ర్’ సినిమాకు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. అయితే అడివి శేష్ మాత్రం ఈ సినిమా ఫ‌లితంతో ఇంకా సంతృప్తిగా లేన‌ని చెప్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. నాకు ఈ సినిమా విష‌యంలో ఎన్ని కోట్లు వ‌చ్చినా అది స‌రిపోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు ఎంత వ‌చ్చినా అది త‌క్కువే అని చెప్పాడు. మేజ‌ర్ సందీప్, ఆయ‌న జీవితం అంత‌కంటే గొప్ప‌ది అనే భావాన్ని వ్య‌క్తం చేశాడు.

  ‘మేజ‌ర్’ చూసిన త‌ర్వాత సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌ల్లిదండ్రుల రియాక్ష‌న్

  సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆదారంగా తెర‌కెక్కిన ‘మేజ‌ర్’ సినిమాను ఆయ‌న త‌ల్లిదండ్రులు హైద‌రాబాద్‌లో చూశారు. మూవీ చూసిన వాళ్లు చాలా గ‌ర్వంతో పాటు ఎమోష‌న‌ల్‌గా స్పందించారు. సందీప్ చ‌నిపోయాడ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు ఇత‌రుల ప్రాణాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించాడు. అది ఎంతోమందికి స్పూర్తినిస్తుంది. సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు.. నా కెరీర్‌ను హైదరాబాద్ నుంచే ప్రారంభించాను. కొంత‌కాలం సందీప్‌తో క‌లిసి ఇక్క‌డ ఉన్నాను. ఇక‌నుంచి ఇక్క‌డికి మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంటాను అని చెప్పాడు.

  అమెరికాలో ‘మేజ‌ర్’ ప్రీమియ‌ర్ షో బిజినెస్ @ 200K డాల‌ర్స్‌

  ‘మేజ‌ర్’ మూవీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌స్తుంది. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ్ జీవితాన్ని తెర‌పై చూపించిన విధానం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. విదేశాల్లో ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అమెరికాలో కేవ‌లం ప్రీమియ‌ర్ బుకింగ్స్ బిజినెస్ 200K డాల‌ర్లుగా న‌మోదైంది. ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకుంటున్న ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వ‌డం ఖామ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్‌, ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.