విరాట్ ఫేక్ ఫీల్డింగ్‌పై రచ్చ
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌పై బంగ్లా క్రికెట్ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పదమైన అంపరింగ్పై సరైన వేదికపై ప్రస్తావిస్తామని పేర్కొంది. ఈ విషయంపై కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదని తెలిపింది. అక్కడ ఫేక్ త్రో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని. అంపైర్లు తాము గమనించలేదని చెప్పటంతో రివ్యూకి కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. వర్షం తగ్గిన కాసేపటికే ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉన్న మ్యాచ్ త్వరగా ప్రారంభించారని చెప్పింది.