గుర్తుకొస్తున్నాయి:షాహిద్ అఫ్రిదీ
పాకిస్థాన్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ లు ప్రేక్షకులు మిస్ అయ్యారని ఆ జట్టు మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిదీ అన్నాడు. 2009లో శ్రీలంక పై ఉగ్ర దాడి జరిగినప్పుడు.. మైదానాలు కల్యాణ మండపాలుగా మారాయని చెప్పాడు. అప్పుడు మళ్లీ మ్యాచ్ లు జరిగేలా చేసేందుకు బోర్డుతో పాటు ప్రభుత్వం కష్టపడిందన్నాడు. తాము సిరీస్ లు ఆడేందుకు వెళ్లి ప్రత్యర్థి జట్లను అడిగేవాళ్లమని వెల్లడించాడు. తర్వాత పరిస్థితి మెరుగుపడిందని.. ఇప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు వస్తున్నాయన్నాడు.