• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అనంతకు వచ్చేస్తున్న ‘గాడ్ ఫాదర్’

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏపీలోని అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 28న స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  మూడేళ్లుగా ఇంటికే పరిమితం

  తల్లిదండ్రులను కోల్పోయిన బాధ.. ఆ ముగ్గురిని కుంగుబాటుకు గురిచేసింది. దీంతో అనంతపురానికి చెందిన తిరుపాల్‌శెట్టి, విజయలక్ష్మి, కృష్ణవేణిలు మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. రాత్రిళ్లు చీకట్లోనే మెలిగేవారు. తల్లిదండ్రులు డిపాజిట్ చేసిన మొత్తంతో వచ్చే వడ్డీని తిరుపాల్‌శెట్టి తీసుకువచ్చి.. భోజనం, నీరు తెచ్చేవాడు. ఆ తర్వాత మళ్లీ తలుపులు వేసుకునేవారు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు.. బలవంతంగా తలుపులు తెరిపించి ఈ ముగ్గురిని శుక్రవారం బయటకు రప్పించారు.