• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

    AP: రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీగా మార్గం సుగమమైంది. పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో పోస్టుల భర్తీని నిలిపివేస్తూ విధించిన స్టేను ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. పరీక్షా నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం కాకుండా, విరుద్ధంగా పరీక్షను నిర్వహించారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా స్టేను ఎత్తివేసి 600 అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాలని సూచించింది.

    పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేత

    AP: మహిళా సంక్షేమ శాఖలో గ్రేడ్ 2 పోస్టుల భర్తీని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ వర్కర్లను విస్తరణ అధికారులుగా(సూపర్‌వైజర్‌) నియమించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాత పరీక్షకు 45, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీకి 5 మార్కులు కేటాయించారు. ఈనెల 18న రాత పరీక్ష నిర్వహించగా.. ప్రొఫిషియన్సీ పరీక్ష లేకుండానే ఫలితాల విడుదలకు సిద్ధమవుతోందని పిటిషన్ దాఖలైంది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది .