ఏపీ కాంగ్రెస్కు నూతన సారథిగా రుద్రరాజు
విభజనానంతరం ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగైంది. 2014,2019 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు గెలవలేని దుస్థితికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. అలాగే 18 మందితో పొలిటికల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది. కార్యనిర్వహణ అధ్యక్షులు, వివిధ కమిటీల చైర్మన్ల పేర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.