నేటి నుంచే ఏపీ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 6 నుంచి జూన్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 207160 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మార్కుల బెటర్మెంట్ కోసం 8609 మంది పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు.