సర్కారు వారి ‘పాట’ పాడిన ఆ స్టార్ సింగర్
బుట్టబొమ్మ, గుచ్చే గులాబి వంటి పాటలతో తెలుగులో ఫేమస్ అయ్యాడు బాలివుడ్ సింగర్ అర్మాన్ మాలిక్. ఇప్పటివరకు ఆయన తెలుగులో 30కి పైగా పాటలు పాడాడు. తాజాగా మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కూడా ఒక పాట పాడినట్లు తెలుస్తుంది. దీంతో ఆ పాట సూపర్‌హిట్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సర్కారు వారి పాటకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కళావిత, పెన్నీ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మే 12న విడుదల కాబోతుంది.