మన్కడ్కు శౌర్య పురస్కారం ఇవ్వాలి: అశ్విన్
దీప్తి శర్మ మన్కడ్ వివాదాస్పదమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి దీనిపై స్పందించాడు. ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ దీప్తి శర్మ మన్కడ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇలా అయితే నీకు ఇంకెన్ని వికెట్లు వచ్చేవో జేమ్స్’ అని జేమ్స్ ఆండర్సన్ను ట్యాగ్ చేశాడు. దీనికి అశ్విన్ స్పందిస్తూ నిజానికి అదొక మంచి ఐడియా. అంత ఒత్తిడిలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా కూడా, సమయస్ఫూర్తితో వికెట్ తీయడం గొప్ప విషయం. దీనికి ఐసీసీ శౌర్య పురస్కారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశాడు.