బాసరలో నేటి నుంచి వసంత పంచమి వేడుకలు
బాసరలో వసంత పంచమి వేడుకలకు సరస్వతి అమ్మవారి క్షేత్రం ముస్తాభైంది. నేటి నుంచి 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 26న అమ్మవారి జన్మనక్షత్రం వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మూడు రోజుల్లో సరస్వతి మాత సమక్షంలో అక్షరభ్యాసం చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో బాసరకు తరలి రానున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.