బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. పీయూసీ 2 విద్యార్థి భానుప్రసాద్ తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భానుప్రసాద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా రంగాపూర్. మృతుడు సూసైడ్ నోటి రాసి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. కాగా విద్యార్థి మృతిని క్యాంపస్ అధికారులు గోప్యంగా ఉంచారు. భానుప్రసాద్ మృతికి నిరసనగా తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు.