• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డిసెంబర్ 19న ఐపీఎల్‌ వేలం

    ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్లు, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూను కలిగి ఉండనున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్

    డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ కొలుకున్నాడు. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో రేపు ఆఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ అందుబాటులో ఉండటం లేదు. ఆఫ్గన్‌తో మ్యాచ్ కోసం అతడు ఢిల్లీ వెళ్లలేదని బీసీసీఐ పేర్కొంది. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 14 భారత్, పాక్ మ్యాచ్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి తెలుస్తోంది.

    బర్త్‌డే రోజు ఇషాన్‌ను ఆటపట్టించిన రోహిత్

    టీమిండియా క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ బర్త్ డే సందర్బంగా BCCI ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను వీడియోలో చూపించింది. ఈ క్రమంలోనే ఇషాన్‌ను ఆటపట్టిస్తూ తనకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నావని రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించి భారత జట్టుకు బహుమతిగా ఇవ్వాలని కోరాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. A day in the life … Read more

    గోల్డ్ మెడలే లక్ష్యం: రుతురాజ్

    ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి పోడియం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించడమే తన లక్ష్యమని రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. భారత్ క్రికెట్ జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ క్రీడలకు జట్టు చైనా వెళ్లనుంది. ఈ మేరకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు క్రీడలు జరగనున్నాయి. మరోవైపు, సెప్టెంబర్ 28 నుంచే వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఇందులో ఉన్నాడు. … Read more

    వావ్.. సూపర్ క్యాచ్

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే 3 వికెట్లు తీసింది. ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. క్రీజుకి ఎడమవైపు కాస్త లోగా వచ్చిన బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. ఎంతో అద్భుతం అంటూ ఈ క్యాచ్‌ని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ????. ?. … Read more

    పంత్ త్వరగా కోలుకో: టీమిండియా

    రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మన్ గిల్ పంత్‌ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరారు. ‘పంత్.. నువ్వు పోరాట యోధుడివి. ఇబ్బందులను అధిగమించడం నీకేమీ కొత్త కాదు. అలాగే ఇప్పుడు కూడా కాలాన్ని జయించగలవు. మన జట్టు, దేశం నీ వెనక ఉంది. మా ప్రేమాభినాలు ఎప్పుడూ … Read more

    ఆస్ట్రేలియాలో విరాట్ బర్త్‌డే

    ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ శనివారం తన పుట్టినరోజును జరుపుకొన్నాడు. ఆస్ట్రేలియాలో తోటి భారత ప్లేయర్ల మధ్య విరాట్ కేక్ కట్ చేశారు. కోహ్లీతో పాటు కోచ్ పాడీ ఆప్టన్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో ఇద్దరూ వేడుకలు చేసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ కేక్ కట్ [వీడియో](url)ను ట్విటర్‌లో షేర్ చేసింది. కోహ్లీ, ఆప్టన్‌లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్లేయర్లు సంతోషంగా మెలుగుతూ వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. Birthday celebrations ON in Australia ? ? … Read more

    తిరువనంతపురం చేరుకున్న భారత ఆటగాళ్లు

    దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు తిరువనంతపురం చేరుకున్నారు. వీరికి అక్కడ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. పూలజల్లుతో ఆహ్వానించి.. నుదుట తిలకం దిద్దించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. హలో తిరువనంతపురం అంటూ అందులో రాసుకొచ్చింది. వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Hello Thiruvananthapuram ? Time for the #INDvSA T20I series. … Read more

    హలో హైదరాబాద్ అంటూ BCCI స్పెషల్ వీడియో

    ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ‘హలో హైదరాబాద్’ అంటూ ఓ స్పెషల్ [వీడియోను](url) ట్వీట్ చేసింది. ఆ వీడియోలో భారత ఆటగాళ్లు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు చేసిన జర్నీని చూపించింది. కాగా మరోకొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. Nagpur ✅ Hello Hyderabad! ?#TeamIndia | #INDvAUS pic.twitter.com/gIey9Ncqm8 — BCCI (@BCCI) September 25, 2022

    బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఇండియన్ ప్లేయర్స్

    దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022లో ఇండియన్ టీం అదరగొట్టింది. పాకిస్థాన్, హాంగ్‌కాన్‌ను ఓడించి సూపర్ 4కు అర్హత సాధించింది. లీగ్ మ్యాచెస్ అయిపోవడంతో కొంచెం ఖాళీ సమయం దొరకింది. దీంతో దుబాయ్ బీచ్‌లో క్రికెటర్లందరూ ఎంజాయ్ చేశారు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో పాటు ఆటగాళ్లందరూ బీచ్‌లో బోటింగ్, స్విమ్మింగ్ చేయడంతో పాటు బీచ్ వాలీబాల్ ఆడారు. ఈ మేరకు క్రికెటర్స్ సరదాగా గడుపుతున్న వీడియోను BCCI పోస్ట్ చేసింది. అందులో చాహల్ మాట్లాడుతూ.. ఇలాంటి ఫన్ యాక్టీవిటీలు చేయడం వల్ల … Read more