BCCI కొత్త అధ్యక్షుడిగా బిన్నీ
BCCI కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. సౌరభ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ముంబయిలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన్ను బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. బిన్నీ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో బిన్నీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. 1983 వరల్డ్ కప్ టీంలో రోజర్ బిన్నీ ఒకరు.