మహిళలపై నితీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ మహిళలు విద్యావంతులైతేనే జనాభా అదుపులోకి వస్తుంది. వారు చదువుకుంటే గర్భం దాల్చకుండా ఏమేం చేయాలనే దానిపై అవగాహన ఉంటుంది. ఈ విషయంలో మగవారు నిర్లక్ష్యంగా ఉంటారు. మహిళలు నిరక్ష్యరాస్యులుగా ఉండటం వల్ల అణిచివేతకు గురవుతూ..జనాభా నియంత్రణ కట్టడి చేయలేకపోతున్నారు. వారు విద్యావంతులైతేనే కట్టడి సాధ్యమవుతుంది” అన్నారు. దీనిపై భాజపా మండిపడుతోంది.