• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐసీసీ టెస్టు జట్టులో రిషబ్ పంత్

  2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి రిషబ్ పంత్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. జట్టుకు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ని ఐసీసీ ఎంపిక చేసింది. ఇక టెస్టు జట్టులో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా చోటు సంపాదించాడు. ఉస్మాన్ ఖవాజా, క్రైగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబుషేన్, బెయిర్‌స్టో, కమిన్స్, రబాడ, నేథన్ లైయన్, జేమ్స్ అండర్సన్‌ సభ్యులుగా ఉన్నారు. 2022లో పంత్ 12 టెస్టు ఇన్నింగ్సులు ఆడాడు. మొత్తంగా 680 పరుగులు చేశాడు. ఇందులో రెండు … Read more

  బెన్ స్టోక్స్‌కు భారీ ధర; ధోని రియాక్షన్ ఇదే

  బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్‌ వేలంలో రూ.16.25 కోట్లు కుమ్మరించి సీఎస్కే ఫ్రాంచైజీ కొనడంపై మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సంతోషం వ్యక్తం చేసినట్లు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. ‘‘బెన్ స్టోక్స్‌ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. చెన్నై జట్టుకు ఆల్‌రౌండర్ కావాలి. ఇప్పుడు స్టోక్స్ రాకతో జట్టు పటిష్టంగా మారింది. జట్టులోకి స్టోక్స్ వచ్చినందుకు ధోని చాలా సంతోషించాడు. కైల్ జేమిసన్ గాయం నుంచి కోలుకోవడంతో కొనుగోలు చేశాం.’’ అంటూ కాశీ తెలిపాడు.

  మొదలైన IPL వేలం

  ఐపీఎల్ మినీ వేలం మొదలైంది.. గతేడాదిలా మెగావేలంలా ఉండకపోయినా కొందరు ఆటగాళ్లు ఎంతకు అమ్ముడవుతారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్, సామ్ కరన్‌లకు మంచి ధర పలికే అవకాశం ఉంది. కామెరాన్ గ్రీన్‌పైనా ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. SRH, పంజాబ్‌ అత్యధిక డబ్బు కలిగి ఉండటంతో వీరు పోటీ పడే ఛాన్స్ ఉంది. హ్యారీ బ్రూక్‌, కేన్‌ విలియమ్సన్‌, పూరన్‌లను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

  ఐపీఎల్‌ మినీ వేలం: ఎవర్ని ఎవరు కొంటారో?

  ఐపీఎల్ మినీ వేలానికి సర్వం సిద్ధమయ్యింది. గతేడాది మెగావేలంలా ఉండకపోయినా కొందరు ఆటగాళ్లు ఎంతకు అమ్ముడవుతారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్, సామ్ కరన్‌లకు మంచి ధర పలికే అవకాశం ఉంది. కామెరాన్ గ్రీన్‌పైనా ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. SRH, పంజాబ్‌ అత్యధిక డబ్బు కలిగి ఉండటంతో వీరు పోటీ పడే ఛాన్స్ ఉంది. హ్యారీ బ్రూక్‌, కేన్‌ విలియమ్సన్‌, పూరన్‌లను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

  కోహ్లీ సరసన నిలిచిన స్టోక్స్

  సొంతగడ్డపై పాకిస్తాన్‌ను టెస్ట్ సీరీస్ క్లీన్‌స్వీప్ చేసి ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాక్‌తో మూడో టెస్టులో గెలవడంతో స్టోక్స్ ఖాతాలో 9 విజయాలు చేరాయి. దీంతో క్యాలెండర్ ఇయర్‌లో ఈ ఘనత సాధించిన కెప్టెన్ల జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఈ ఘనత నమోదు చేసిన ఏడో కెప్టెన్‌గా నిలిచి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఒకే ఏడాది 9 విజయాలు సాధించిన వారిలో గ్రేమీ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్‌వా, మైకేల్ వాన్, క్లైవ్ లాయిడ్, విరాట్ కోహ్లీ … Read more

  పాకిస్థాన్ కు బెన్ స్టోక్స్ సాయం

  ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన ఉదారత చాటుకున్నాడు. పాకిస్థాన్ తో ఆడనున్న టెస్ట్ మ్యాచ్ ఫీజును అక్కడ వరద బాధితులకు సహాయంగా అందజేస్తానని ప్రకటించాడు. “చరిత్రాత్మక సిరీస్ ఆడటానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ ఫీజు మెుత్తాన్ని నేను పాక్ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నాను. ఈ ఏడాది ప్రారంభంలో వరదలు పాకిస్థాన్ ను చిన్నాభిన్నం చేశాయి. ప్రజలు, దేశంపై ప్రభావం చూపాయి. నా సహాయం ఉపయోగపడుతుందని భావిస్తున్నా” అన్నాడు.

  స్టోక్స్ 50 రన్స్ కొట్టకపోవటానికి కారణం

  పాక్ పై కీలక ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్ కు ఇదే తొలి అర్థ సెంచరీ. ఇప్పటివరకు 48 మ్యాచ్ లు ఆడినప్పటికీ 50 పరుగులు మార్కును దాటలేదు. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. స్టోక్స్ ఎక్కువగా 5,6 స్థానాల్లో బ్యాటింగ్ కు దిగుతాడు. ఫలితంగా అప్పటికే ఇన్నింగ్స్ చాలావరకు పూర్తై పోవటంతో అవకాశం రాలేదు. నిన్న టాప్ ఆర్డర్ విఫలం కావటంతో తనలో సత్తా చూపించి తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు.

  ‘బెన్ స్టోక్స్’ విలన్ కాదు హీరో

  టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు కప్పు తీసుకువచ్చిన బెన్ స్టోక్స్ కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2016 ప్రపంచ కప్ లో చివరి ఓవర్లో బ్రాత్ వైట్ నాలుగు సిక్సర్లు బాది ఇంగ్లాండ్ ను చిత్తు చేశాడు. అప్పడు బౌలింగ్ వేసింది స్టోక్స్ కావటంతో విమర్శలు వచ్చాయి. తర్వాత ఓ నైట్ క్లబ్ వివాదంలోనూ చిక్కుకున్నాడు. అనంతరం వన్డే వరల్డ్ కప్ ఇప్పుడు టీ ట్వంటీలోనూ సత్తా చాటి తాను విలన్ కాదు హీరో అని … Read more

  ‘వీళ్లని త్వరగా ఔట్ చేయాల్సిందే’

  సెమీఫైనల్‌లో టీమిండియాతో పోరుపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ స్పందించాడు. సూర్య, విరాట్, రోహిత్‌ల గురించి స్టోక్స్ మాట్లాడాడు. ‘రోహిత్ ఫామ్ లేమి మాకు కలిసొస్తుంది. అయితే, అతడికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. మాపై అతడు ఆడకూడదు అని అనుకుంటున్నా. ఫామ్‌లో ఉన్న విరాట్ ఆట చూస్తుంటే భయమేస్తుంది. ఎలాగైనా కోహ్లీని సెమీఫైనల్లో మేం త్వరగా ఔట్ చేయగలగాలి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ బ్యాట్స్‌మన్ ఆడే షాట్లు చూస్తుంటే మతిపోతుంది. ఇతన్ని త్వరగా పెవిలియన్‌కి పంపకపోతే మేం … Read more

  ‘హార్దిక్, స్టోక్స్.. ఇద్దరూ ఇద్దరే’

  ప్రస్తుత తరంలో హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్ ఇద్దరూ ఉత్తమ ఆల్‌రౌండర్లేనని సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నాడు. వారిద్దరూ టాప్ క్లాస్ ప్లేయర్స్ అని కితాబిచ్చాడు. ఇద్దరినీ పోల్చి చూడాల్సని అవసరం లేదని చెప్పాడు. కాగా ప్రస్తుత తరంలో ఉత్తమ ఆల్‌రౌండర్ ఎవరనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోన్న క్రమంలో కలిస్ స్పందించాడు. కలిస్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీరీస్‌లో ఆడుతున్నాడు.