• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే

    కీరవాణి స్వరపరిచిన RRR మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. ఈ గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. నాటు నాటు పాటతో పాటు కీరవాణి ఎన్నో వీనుల విందైన పాటలను స్వరపరిచారు. వాటిలో టాప్ 10 పాటలు ఓసారి చూద్దాం. 1. ఎత్తర జెండా- RRR RRRలోని నాటు నాటు పాటతో పాటు   ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరో పాట ఎత్తర జెండా. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను విశాల మిశ్రా, హారిక నారాయణ్ అద్భుతంగా పాడారు. YouTube Video … Read more

    స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ ‘బింబిసార’ టీమ్‌

    నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ భారీ విజ‌యం సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా మంచి వ‌సూళ్ల‌ను కురిపిస్తుంది. ఇప్ప‌టికే బ్రేక్‌-ఈవెన్ సాధించి లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమా నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సంతోషాన్ని మిగిల్చింది. దీంతో చిత్ర‌బృందం తాజాగా కేక్ క‌ట్‌చేసి గ్రాండ్‌గా స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. బింబిసార‌కు వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కేథ‌రిన్‌, సంయుక్త మీన‌న్ హీర‌రోయిన్లుగా న‌టించారు. కీర‌వాణి మ్యూజిక్ అందించాడు.

    ‘బింబిసార’ ర్యాప్ సాంగ్ రిలీజ్

    నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన ‘బింబిసార’ మూవీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే అత్యంత వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవ‌లం అమెరికాలోనే ఇప్ప‌టివ‌ర‌కు 350కె డాల‌ర్లు సాధించింది. తాజాగా మూవీ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎం.ఎం కీర‌వాణి మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను లిప్సిక‌, పృథ్వీ చంద్ర‌, ఆదిత్య అయ్యంగార్ క‌లిసి పాడారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌ను క‌లిపి చేసిన ఈ ర్యాప్‌సాంగ్ అద‌ర‌గొడుతుంది. మీరూ ఓ లుక్కేయండి.

    ‘బింబిసారా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తారక్

    కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ త్రెస్సా జంటగా.. మల్లిడి వశిష్ట్ ‘బింబిసారా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

    ‘బింబిసార’ నుంచి సూప‌ర్ సాంగ్ వ‌చ్చేస్తోంది

    క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసారా’ మూవీ నుంచి ఓ తేనే ప‌లుకుల సాంగ్ జులై 23న రిలీజ్ కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్‌రామ్, కేథ‌రిన్‌పై తెర‌కెక్కించిన ఈ పాట‌ను హైమ‌త్, స‌త్య యామిని క‌లిసి పాడారు. వ‌రికుప్ప‌ల యాద‌గిరి దీనికి సంగీతం అందించారు. నాలుగు బాగాలుగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు క‌ళ్యాణ్‌రామ్ వెల్ల‌డించాడు. బింబిసారా మొద‌టి భాగం ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. వ‌శిష్ఠ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. https://youtube.com/watch?v=sqD0Loac-aQ

    బింబిసార నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

    బింబిసార మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈశ్వరుడే.. ఈశ్వరుడే అంటూ సాగే పాటలో కళ్యాణ్ రామ్ లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయి. పాటలో కనిపిస్తున్న ఆయన యాక్షన్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

    క‌ళ్యాణ్ రామ్ ‘బింభీస‌ర’ ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది

    క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న ‘బింభీస‌ర’ ట్రైల‌ర్ జులై 4న వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ మొద‌టిసారిగా మైథాల‌జిక‌ల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో క్యాథ‌రిన్ త్రెసా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆగ‌స్ట్ 5న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.