బీజేపీ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ
బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనాకు చంపేస్తామని బెదిరింపు లేఖలు వచ్చినట్లు వెల్లడించారు. నపూర్ శర్మకు అనుగుణంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు హత్యకు గురైన కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతం ఇస్తానని ప్రకటించడంతో తనకు బెదిరింపు వచ్చినట్లు తెలిపారు. ఆ లేఖను సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర హోం వ్యవహరాల శాఖ నిత్యానంద్ రాయ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు పంపించామని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.