‘బ్లూ’ టిక్ వారికి మాత్రమే ఆ అవకాశం
ట్విటర్లో విధానపరమైన నిర్ణయాలపై ‘బ్లూ’ టిక్ సబ్స్క్రైబర్లకు మాత్రమే పోల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు ట్విటర్ తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. కాగా ట్విటర్ సీఈఓగా మస్క్ పదవిలో కొనసాగాలా? వద్దా? అన్న పోల్ ముగిసింది. దాదాపు 1.7 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్లో పాల్గొన్న వారిలో 57 శాతం మంది వైదొలగాలి అని.. 43 శాతం మంది కొనసాగాలి అని ఓట్లు వేశారు. ఈ ఫలితాలపై ఎలన్ మస్క్ ఇంకా స్పందించలేదు.