• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విక్కీతో జత కట్టనున్న సమంత

    స్టార్ హీరోయిన్ సమంత మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రంలో నటుడు విక్కీ కౌశల్‌లో కలసి తెర పంచుకోనుంది. ‘ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోంది. కాగా ప్రస్తుతం సమంత చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. యశోదా, శాకుంతలం, ఖుషీ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

    అప్పుడు ఏడాది పాటు ఆఫ‌ర్స్‌ లేక ఖాళీగా ఉన్నా: పూజా హెగ్డే

    పూజా హెగ్డే ‘ముకుంద’ సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఇక్క‌డ రెండు సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. కానీ అక్క‌డ వ‌రుస‌గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఎటువంటి ఆఫ‌ర్స్ రాక ఏడాది పాటు ఖాళీగా ఉన్న‌ట్లు తెలిపింది. కానీ ఆ స‌మ‌యంలో ఏం బాధ‌ప‌డ‌లేదు. తాను ఎంచుకుంటున్న క‌థ‌లు స‌రిగ్గా లేవ‌ని అర్థం చేసుకున్న‌ట్లు పేర్కొంది. మ‌ళ్లీ తెలుగు సినిమాల హిట్‌తోనే త‌న కెరీర్ పుంజుకుంద‌ని చెప్పింది. ఈ బుట్ట‌బొమ్మ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో 2 సినిమాలు చేస్తుంది. బాలీవుడ్‌లోనూ కొత్త‌ … Read more

    స‌ల్మాన్‌ఖాన్‌తో స‌మంత‌?

    స‌మంత తెలుగులో పాటు హిందీ సినిమాల్లో బిజీగా మారింది. ఈమ‌ధ్య త‌రచుగా బాలీవుడ్‌తో ట‌చ్‌లో ఉంటున్న ఈ భామ ఓ భారీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకుంది. స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టించేందుకు స‌మంత‌ను సంప్ర‌దించార‌ట‌. దీనికి ఆమె ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. సౌత్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు తెలిసిన హీరోయిన్ అయితే సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావించిన స‌ల్మాన్ స‌మంత‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. తెలుగులో ఇప్ప‌టికే య‌శోధ‌, శాకుంత‌లం విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీలో న‌టిస్తుంది.

    బాలీవుడ్ తొలి పాన్ ఇండియా మూవీ ‘బ్ర‌హ్మాస్త్రం’ గ్రాండ్ ట్రైల‌ర్‌

    ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాల‌ను పాన్ఇండియా అంటూ బాలీవుడ్‌లో రిలీజ్ చేశారు. అయితే తొలిసారిగా ఒక హిందీ మూవీని పాన్ఇండియా సినిమాగా సౌత్‌లోని అన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ ఇందులో శివ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆలియాభ‌ట్ ఆయ‌న ప్రేయ‌సిగా న‌టించింది. మౌనీరాయ్ ఈ సినిమాలో చీక‌టి రాజ్యానికి రాణిగా క‌నిపించ‌బోతుంది. నాగార్జున నంది అస్త్రంగా, అమితాబ్ మైథాల‌జిక‌ల్ ప్రొఫెస‌ర్‌గా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ట్రైల‌ర్ అదిరిపోయింది. ఈ చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బ్ర‌హ్మాస్త్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ … Read more

    బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు చేస్తున్న డైరెక్ట‌ర్ తేజ‌

    డైరెక్ట‌ర్ తేజ చాలాకాలం గ్యాప్ త‌ర్వాత ప్ర‌స్తుతం రెండు బాలివుడ్ ప్రాజెక్టుల‌కు సంత‌కం చేశాడు. NH స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్‌తో కలిసి టైమ్ ఫిల్మ్స్ నిర్మించే రెండు హిందీ ప్రాజెక్ట్‌లకు దర్శకత్వం వహించనున్నాడు. అందులో ఒకటి మూవీ పేరు“జఖామి”. కాగా ‘తస్కరి’ అనే మ‌రో వెబ్ సిరీస్‌కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తేజ 2019 లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌తో తెర‌కెక్కించిన ‘సీత’ మూవీ త‌ర్వాత మూడేళ్లు సినిమాల‌కు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు బాలివుడ్‌లో కొత్త ప్రాజెక్టుల‌తో బిజీ కాబోతున్నాడు.