• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెలూన్‌ స్ట్రోక్‌ వారిలోనే ఎక్కువ

    షుగర్, బీపీ, గుండెజబ్బులు ఉన్నవారిలో ‘సెలూన్ స్ట్రోక్’ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా ‘బ్యూటీపార్లర్ స్ట్రోక్’ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉబకాయం, అధిక ధూమపానం చేసేవారిలో కూడా ఈ స్ట్రోక్ రావచ్చని పేర్కొంటున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ 50 ఏళ్ల మహిళకు బ్యూటీపార్లర్‌లో ‘సెలూన్ స్ట్రోక్’ వచ్చిన సంగతి తెలిసిందే.

    షుగర్, బీపీ పేషెంట్లకు గుడ్‌న్యూస్

    మధుమేహం, రక్తపోటు రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఎన్‌సీడీ కిట్లు అందజేస్తోంది. కేసీఆర్ కిట్ల తరహాలోనే చిన్న సైజు బ్యాగులు ఇస్తున్నారు. ఒక నెలకు సరిపడా మందులు, వాటిని ఎలా వాడాలో తెలిపే అవగాహన పత్రం బ్యాగ్‌లో ఉంటాయి. ఈ కిట్లను రాష్ట్రంలోని 7 లక్షల మంది షుగర్ రోగులకు, 20 లక్షల మంది బీపీ పేషంట్లకు ఇవ్వనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం మొదలైంది.