• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRS బీసీని సీఎం చేయగలదా?: సంజయ్

    తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయబట్టారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్‌ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా మంచి జరగాలని చెప్పారు.

    BRS గెలవకపోతే అభివృద్ది ఆగిపోతుంది: KTR

    కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన హైదరాబాద్‌లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోందన్నారు. కానీ విపక్షాలకు అది కనిపించట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని తెలిపారు. ఈ పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

    BRS ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత పెంపు

    బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిన భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. తమకు కూడా భద్రత పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    భారాస ఎంపీపై హత్యాయత్నం

    TG: దుబ్బాక భారాస అభ్య‌ర్థి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఓ పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకొచ్చిన ఎంపీకి షేక్ హ్యాండ్‌ ఇస్తానని వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్ర‌భాక‌ర్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి. తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న దౌల్లాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో చోటు చేసుకుంది. మరోవైపు నిందితుడ్ని పట్టుకున్న … Read more

    ‘కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రం నాశనమే’

    HYD: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే భారాస ప్రభుత్వం తిరిగి రావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డిని ఇంటికెళ్లి కలిసిన మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

    భారాస హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం: సర్వే

    తెలంగాణలో భారాస హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని తాజాగా విడుదలైన రాజ్‌నీతి సర్వే పేర్కొంది. 77 సీట్లల్లో గెలిచి BRS అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. అటు కాంగ్రెస్‌ 29, భాజపా 6 స్థానాలకు పరిమితం అవుతాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పింది. హైదరాబాద్‌లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఓట్ల పరంగా చూస్తే భారాసకు 43.35% ఓట్లు పోలవుతాయని సర్వే నివేదిక వెల్లడించింది.

    వాళ్లు సర్వేల్లో గెలిస్తే.. మేం ఎన్నికల్లో గెలుస్తాం: కవిత

    బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం ఎలక్షన్‌ స్టంట్‌ అని ఆరోపించారు. బీజేపీతో తమకు ఎలాంటి డీల్‌ లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కచ్చితంగా 95-105 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. ఓబీసీల కుల గణన చేయడాన్ని కేంద్రం నిరాకరిస్తోందిని మండిపడ్డారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదని కవిత పేర్కొన్నారు.

    కేసీఆర్‌కు మద్దతు ఇవ్వండి: ఓవైసీ

    TG: కాంగ్రెస్‌, భాజపాలు అవిభక్త కవలలని MIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో మామ (కేసీఆర్‌)కు మద్దతివ్వాలని అసదుద్దీన్‌ పిలుపునిచ్చారు. ‘నేను బాధ్యత తీసుకుంటాను. ఎన్నికల్లో భారాసకు మద్దతివ్వండి. మామ (కేసీఆర్‌) మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుంది’ అని ఓవైసీ అన్నారు.

    ప్రజలు భారాసతో ఉన్నారు: కేటీఆర్

    TG: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో, తొమిదేళ్ల పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. సంస్కారమంటే ఏమిటో కాంగ్రెస్‌ నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని కేటీఆర్‌ అన్నారు. కిషన్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. భాజపాకు 100.. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని కేసీఆర్‌ చెప్పారు.

    లేటెస్ట్‌ సర్వే.. కేసీఆర్‌దే విజయం!

    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తుందని మిషన్‌ చాణక్య సర్వే వెల్లడించింది. తెలంగాణ ప్రజలు గులాబీ వైపే ఉన్నట్లు సర్వేలో తేలిందని పేర్కొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదికలో తెలిపింది. BRS కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని మిషన్‌ చాణక్య జోస్యం చెప్పింది. గత 4 నెలల్లో రాష్ట్రంలోని 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించి ఈ డేటాను రూపొందించినట్లు సర్వే సంస్థ స్పష్టం … Read more