• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్ఎస్‌కు సుప్రీం కోర్టులో షాక్

    సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని అభ్యర్థించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు ఈసీ కేటాయించడంపై సుప్రీంలో బీఆర్ఎస్ సవాలు చేసింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. రోడ్ రోలర్, చపాతి మేకర్, ట్రక్కు, టైప్ మిషిన్ వంటి గుర్తులు కారును పోలిన గుర్తులుగా బీఆర్ఎస్ పేర్కొంది. ఈ గుర్తుల వల్ల గత ఎన్నికల్లో భారీగా … Read more

    కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు: ఒవైసీ

    తెలంగాణ ఎన్నికల్లో సంపూర్థ మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ ప్రకటించారు. పేదల కోసం కేసీఆర్‌ చాలా పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. బీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు హ్యాట్రిక్‌ సీఎం అవుతారని అసదుద్ధీన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని విమర్శించారు.

    బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ బహిరంగ సభలో పొన్నాల సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాలకు పార్టీలో సుముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఉండి ఎన్నో అవమానాలకు గురయ్యానని పొన్నాల అన్నారు. 45 ఏళ్లు కష్టపడినా పలితం దక్కలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌లో చేరానని పొన్నాల పేర్కొన్నారు.

    కారును పోలిన గుర్తులపై సుప్రీంకు బీఆర్ఎస్

    వచ్చే ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో పిటిషన్‌ను వెనక్కు తీసుకుంది. గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు పిటిషన్‌లో పేర్కొంది. రోడ్ రోలర్, చపాతి రోల్ వంటి గుర్తులను తొలిగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.

    కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి: బండి సంజయ్

    తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు అతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని మళ్లీ బీఆర్ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు.

    110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కేటీఆర్

    అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే. అమిత్ షా- మోదీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదు. మళ్లీ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

    కరప్షన్‌, కమీషన్‌ ఈ రెండు పార్టీల సిద్ధాంతం: మోదీ

    తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కరప్షన్‌, కమీషన్‌ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. ‘పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ మరో పార్టీ చేతిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది. మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉంది. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది అని చెప్పుకొచ్చారు.

    సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌

    TS: పార్టీల మధ్య వివాదం సోషల్ మీడియాకెక్కింది. వరదలతో ధ్వంసమైన రోడ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘అవినీతితో వేసిన రోడ్లపై బంగారు తెలంగాణ ఇదిగో’ అంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. అవినీతి గురించి ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ మాట్లాడటం విడ్డూరమంటూ రిప్లై ఇచ్చింది. కాగా, చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీలకతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. What an irony!The King of Corruption – 'All Indian Corruption Committee' is talking about corruption. … Read more

    రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    TS: రైతులకు 3 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనే రేవంత్‌ని ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సారీ చెప్పేదాకా వారిని గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొని కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిరసన చేపట్టింది. #WATCH | BRS MLC … Read more

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more