• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డుపై ఆవులు.. యజమానికి జైలు శిక్ష

    రోడ్డుపై పశువులను ఇష్టారీతిన విడిచి పెట్టినందుకు యజమానికి గుజరాత్ హైకోర్టు ఆర్నెళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆవులను రోడ్డుపై వదిలి ప్రజలు, ప్రయాణికులకు భంగం కలగజేస్తున్నందున యజమాని జైన్ దేశాయ్‌కి కోర్టు ఈ శిక్ష విధించింది. జీవాలను రోడ్డుపై వదలడమే కాకుండా, వారించిన అధికారులను దేశాయ్ బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. దీనిపై కోర్టు ఆరుగురు సాక్ష్యులను విచారించి.. శిక్షను మంజూరు చేసింది. ఇలాంటి చర్యలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని హైకోర్టు సూచించింది.