‘వాతావరణం సహకరించ లేదు’
వాతావరణ పరిస్థితుల వల్ల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించలేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకుండా ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కాగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు కూడా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క హిమాచల్కే షెడ్యూల్ ఖరారు చేసింది. కాగా ఈ నెలలోనే గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.