చార్జర్ల క్వాలిటీకి కొత్త స్టాండర్డ్స్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్కు కొత్త నిబంధనలతో వచ్చింది. డిజిటల్ టీవీ రిసీవర్లు, USB టైప్-C చార్జర్, వీడియో సర్వీలియన్స్ కెమెరాలకు నూతన ప్రమాణాలు నిర్దేశించింది. USB టైప్-C కేబుల్ ఇకపై గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇది ఫోన్, ల్యాప్టాప్, నోట్బుక్ ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా ఉండనుంది. దీంతో ఒక్కో డివైజ్కు ఒక్కో చార్జర్ కొనాల్సిన అవసరం తగ్గి, e- వేస్టేజ్ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.