గెహ్లాట్‌కు దొరకని సోనియా పర్మిషన్
రాజస్థాన్ నెలకొన్న సంక్షోభం కారణంగా ఆ రాష్ట్ర సీఎం సోనియాతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే సోనియా గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో గెహ్లాట్‌పై ఎలాంటి రీమార్క్స్ లేనప్పటికీ.. ఎమ్మెల్యేల తిరుగుబాటు అతనికి తెలియకుండా ఎలా ఉంటుందనే అంశంపై సోనియా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రతోనూ ఫోన్లో మాట్లాడడం ఆశ్చర్యంగా మారింది.