‘కోబ్రా’ తెలుగు టీజర్ విడుదల
చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞాన్ ముత్తు తెరకెక్కిస్తున్న మూవీ ‘కోబ్రా’. ఆగష్టు 31వ తేదీన విడుదలకానున్న ఈ మూవీ తెలుగు టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లోని సన్నివేశాలు, BGM, విక్రమ్ యాక్టింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించాడు.