తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కొమురంభీం జిల్లా సిర్పూర్లో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలలో ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీలకు పడిపోయాయి. నిర్మల్ జిల్లా కుంటాలలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. అటు హైదరాబాద్‌లోనూ 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయాన్నే బయటకు వెళ్లాలంటే జనాలు వణికిపోతున్నారు.