ఫిబ్రవరి 3న ‘రైటర్ పద్మభూషణ్’
‘కలర్ ఫొటో’ సినిమాతో మంచి విజయం సాధించిన సుహాస్.. ‘రైటర్ పద్మభూషణ్’గా రాబోతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి ‘కన్నులో నీ రూపమే’ పాట విడుదలై మంచి స్పందనను రాబట్టింది. ఈ సినిమాపై సుహాస్ ట్విటర్లో షేర్ చేస్తూ ‘అమ్మ చెప్పని చందమామ కథ’ అంటూ కామెంట్ చేశాడు. కాగా, పోస్టర్లో సుహాస్ విజయవాడ బ్యారేజీ వద్ద నిలబడి నవ్వుతూ కనిపిస్తున్నాడు. … Read more