కరోనా.. మేడ్ ఇన్ చైనా..
కోవిడ్ 19 వైరస్ చైనా నుంచి వచ్చినదేనని అమెరికా సైంటిస్టు ఆండ్రూ హాప్స్ తెలిపాడు. ఈ మేరకు ఆండ్రూ హాప్స్ ‘ది ట్రూత్ ఎబౌట్ వుహాన్’ పేరుతో ఒక పుస్తకమే రాశాడు. అందులో సంచలన విషయాలను ఆండ్రూ రాసుకొచ్చాడు. కరోనా మానవ నిర్మిత వైరస్ అని వెల్లడించారు. చైనాలోని వుహాన్ ల్యాబ్స్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందని పేర్కొన్నారు. ల్యాబ్లో పరిశోధనలు జరిపే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ బయటకు లీక్ అయినట్లు తెలిపారు.