‘రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తాం’
భారతదేశ ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని తెలిపారు. రాయితీగా ఇంధన ధరలు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదని అన్నారు. మరికొన్ని రోజులకు సరిపడేందుకు ఇంధనం కొనుగోలు చేసినట్లు, తర్వాత కూడా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రష్యా నుంచి ముడి చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికా సహాపలు దేశాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయకూడదని చెబుతున్నాయి.