టపాసులెక్కడ ?
దీపావళి పండుగకు విక్రయించగా మిగిలిన టపాసుల సరకుపై అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సరకును జనావాసాల మధ్య ఉంచుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. పండుగకు అమ్మిన తర్వాత ఎన్నోకొన్ని టపాసులు మిగులుతాయి. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై అధికారులు దృష్టిసారించడం లేదు. ఫలితంగా జనాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలంటున్నారు.