క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.3 లక్షల బీమా
ఫెడరల్ బ్యాక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. క్రెడిట్ కార్డుదారులకు వారి క్రెడిట్‌కు సమానమైన లైఫ్ కవరేజీని అందిస్తోంది. అంటే కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.3 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రమాదవశాత్తు కార్డుదారుడు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు అందజేస్తారు. ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ లైఫ్ కవర్ ఒక ఏడాదిపాటు ఉంటుంది. కేవలం 3 నిమిషాల్లో ఈ బీమాను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ 3 రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది.