రాజకీయాలను క్రికెట్లోకి లాగొద్దు: అఫ్గాన్
క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ని రద్దు చేసుకోవడంపై అఫ్గానిస్థాన్ క్రీడాకారులు స్పందించారు. మూకుమ్మడిగా ఆసీస్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సంస్థాగతపరమైన కారణాలతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం దేశానికి ఉన్న ఒకే ఒక్క ఆశాదీపం క్రికెట్. దయచేసి రాజకీయాలను ఇందులోకి లాగకండి’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. రహ్మనుల్లా గుర్బాజ్, నవీన్ అల్ హక్, రహ్మత్ షా, హమిద్ హసన్ తదితర ప్లేయర్లు కూడా ట్వీట్లు చేయడం … Read more