BREAKING: ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్
హైదరాబాద్- హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నిండిపోయింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.17 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 513 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ పరిస్థితులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.