ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రంప్ స్వగృహం ‘మార్-ఎ-లాగో’ వేదికగా రిపబ్లిక్ పార్టీ హిందూ కోఅలియేషన్ (RHC) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికిపైగా భారతీయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్‌హెచ్‌సీ నాయకుల నైపుణ్యాలను మెచ్చుకున్నారు.తాను మళ్లీ అమెరికా అధ్యక్షుడైతే వారిని అడ్మినిస్ట్రేషన్‌లో భాగస్వాములు చేస్తానని హామీ ఇచ్చారు.