మునుగోడు ఓటర్లకు నేతల దీపావళి ఆఫర్స్
TS: మునుగోడు ఓటర్లకు దీపావళి పండుగ ముందే వచ్చేసింది. ఇప్పటికే ఓటర్లకు మద్యం, మాంసం పంచుతున్న నేతలు ..దీపావళి కూడా ప్రత్యేక బహుమతులు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఇంటికి రూ.5 వేలు తగ్గకుండా వివిధ పార్టీల నేతలు బహుమతులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల పిల్లలకు టపాసులు, మహిళలకు స్వీట్లు, చీరలు అందిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్‌లు,MPTC, ZPTC మెంబర్స్‌కు బైక్‌లు బహుమానంగా ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.