కాంగ్రెస్ అధ్యక్ష పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ పోటీనుంచి దిగ్విజయ్ సింగ్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మల్లికార్జున్ ఖార్గేకు ఆయన మద్దతు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని శశిథరూర్ ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్‌కు ఇవాళే చివరి తేదీ కావడంతో వీరిద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పి వెనక్కి తగ్గగా..ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ కూడా తప్పుకున్నారు. అక్టోబర్ 17న ఈ ఎన్నికలు జరగనుండగా, 19న ఫలితాలు ప్రకటించనున్నారు.