ఢిల్లీ లిక్కర్ కేసులో మరో వ్యక్తి సమీర్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాజాగా మరో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ జోర్బాగ్కు చెందిన మద్యం పంపిణీ సంస్థ ఇండోస్పిరిట్ ఎండీ మహేంద్రుని ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారించిన తర్వాత ఇతన్ని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతోపాటు మరో 14 మందికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు సమాచారం.