బ్యాలెట్లపై పార్టీ గుర్తుల తొలగింపునకు సుప్రీం నో
ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు తొలగించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా ఈసీను ఆదేశించాలంటూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది పిటిషన్ వేశారు.ఈవీఎంపై పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు పార్టీలతో ముడిపడి ఉంటాయని, పిటిషన్ను అంగీకరిస్తే అభ్యర్థి గెలిచాక పార్టీలు మారే ప్రమాదముందని న్యాయస్థానం వెల్లడించింది.