ఇంజనీరింగ్ కాలేజీల కొత్త దందా
తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు సరికొత్త దందాకు తెరలేపాయి. కేవలం తమ కళాశాలలో ఉన్న కోర్సుకే ఆప్షన్ ఇచ్చుకునేలా చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నాయి. బీటెక్, బీఫార్మసీ పూర్తయిన కాలేజీలోనే పీజీ చేయాలని, లేదంటే బకాయి ఫీజులు చెల్లించాలనే షరతు విధిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పీజీఈ సెట్ కౌన్సెలింగ్లో ఒకే ఒక కళాశాలలో, ఒకే ఒక ఆప్షన్ ఇచ్చిన వారు దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.