డోప్ పరీక్షలో ఇద్దరు భారత అథ్లెట్లు విఫలం
బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు ఒక వారం ముందే భారత ఆటగాళ్లకు షాక్ తగిలింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఇద్దరు అథ్లెట్లు డోప్ పరీక్షలో విఫలమయ్యారు. వారిలో స్ప్రింటర్ ధనలక్ష్మి శేఖర్ (24), ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు(25) ఉన్నారు. వీరు నిషేధిత పదార్థాలు తీసుకున్నట్లు తేలింది. గతంలో కూడా వీరు డోప్ టెస్టుల్లో దిరికారు. దీంతో వీరిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.