‘సాకులు వెతకొద్దు.. ఆటపై దృష్టి పెట్టండి’
భారత్‌పై ఓటమికి సాకులు వెతకొద్దని బంగ్లాదేశ్ అభిమానులకు కామేంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్లో సూచించారు. టాప్ బ్యాట్స్మెన్లలో ఒక్కరు చివర వరకు నిలిచినా బంగ్లా గెలిచేదని, దానినే తప్పుబట్టాలన్నారు. ఫేక్ ఫీల్డింగ్, వెట్ గ్రౌండ్ అంటూ సాకులు వెతుకుతూ ఉంటే క్రికెట్లో ఎదగలేమని చెప్పారు. ఒకవేళ ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడితే అంపైర్లు జరిమానా విధించేవారన్నారు. ఇక గ్రౌండ్ చిత్తడిగా ఉందంటున్నారు కానీ, బంగ్లా కెప్టెన్ షకీబ్ కూడా మ్యాచ్ కొనసాగించేందుకు ఒప్పకున్నాడని గుర్తు చేశారు.